Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ఆడుతున్నా... మనసంతా చెన్నైలోనే

టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ మనసంతా చెన్నైలోనే ఉంది. వరదల్లో చిక్కుకుపోయి, ఇబ్బందులు పడుతున్న తన కుటుంబ సభ్యుల గురించి అతను కలత చెందుతున్నాడు. తన వారితో మాట్లాడదామంటే, ఫోన్లు పనిచేయడం లేదని... వారి క్షేమ సమాచారం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై చేరుకుని, తాను కూడా చేతనైన సహాయం చేస్తానని చెప్పాడు. మరోవైపు బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ మాట్లాడుతూ, కొంత కాలంగా తాను కూడా చెన్నైలోనే ఉంటున్నానని... మునుపెన్నడూ ఇలాంటి వరదలను చూడలేదని చెప్పాడు.

More Telugu News